Pawan Mahaveer | జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను టాలీవుడ్‌కు హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం “అమ్మా……. నాకు ఆ అబ్బాయి కావాలి”. శివాల ప్రభాకర్ వైవిధ్యమైన కథాంశంతో, అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటులు సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తూ ఈ చిత్రానికి మరింత బలాన్ని చేకూర్చారు. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటూ, అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం యొక్క టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో అత్యంత ఘనంగా మరియు వైభవంగా జరిగింది.
ఈ ప్రతిష్టాత్మక వేడుకకు టాలీవుడ్ పరిశ్రమ నుంచి ఎందరో దిగ్గజాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (నిర్మాతల మండలి) ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు వల్లభనేని అనిల్, ఫిల్మ్ చాంబర్ ప్రధాన కార్యదర్శి కే అశోక్ కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్యలతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్టులు ప్రభు, సురేష్ కొండేటి మరియు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్‌ను మనస్ఫూర్తిగా అభినందించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, తొలి చిత్రంతోనే సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని శాఖల పట్ల పూర్తి అవగాహన పెంచుకున్న మహిళా నిర్మాత శైలుజా రెడ్డి, రాబోయే రోజుల్లో చిత్ర నిర్మాణ రంగంలో అసాధారణ విజయాలు సాధించి అగ్ర నిర్మాతగా ఎదగడం ఖాయమని ఆకాంక్షించారు. అలాగే ఈ సినిమా ద్వారా టాలీవుడ్‌కు హీరోగా పరిచయమవుతున్న పవన్ మహావీర్ నటనను చూస్తుంటే ఇది అతని మొదటి సినిమా అనిపించలేదని, కెమెరా ముందు అతను ఎంతో ఈజ్‌తో, పరిణతి చెందిన నటుడిలా నటించాడని కొనియాడారు. ప్రస్తుతం లండన్‌లో మెడిసిన్ చదువుతున్న పవన్ మహావీర్, టాలీవుడ్ పరిశ్రమకు దొరికిన మరొక విలక్షణమైన, టాలెంటెడ్ హీరో అని అతిథులు ఘనంగా ప్రశంసించారు.
ఈ వేడుకలో నిర్మాత శైలజ రెడ్డి మాట్లాడుతూ, “అమ్మా……. నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రం అనుకున్నదానికంటే అత్యద్భుతంగా రూపొందడానికి అహర్నిశలు శ్రమించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ టీజర్ వేడుకకు అతిథులుగా విచ్చేసి ఆశీస్సులు అందించిన సినీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం దర్శకుడు శివాల ప్రభాకర్ మాట్లాడుతూ, నిర్మాతగా శైలజ రెడ్డి గారికి, హీరోగా పవన్ మహావీర్ గారికి ఈ చిత్రం టాలీవుడ్లో ఒక ఉజ్వలమైన భవిష్యత్తును ఇస్తుందని నమ్మకంగా చెప్పారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కావడం, తమ నటనను నిరూపించుకునే మంచి పాత్రలు లభించడం పట్ల హీరోయిన్స్ వర్షిక, సుహానా, సుజాతతో పాటు చైల్డ్ ఆర్టిస్ట్ సుప్రీతి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా, మహేందర్.ఎం ఛాయాగ్రాహకుడిగా (డిఓపి) వ్యవహరించారు. నందమూరి హరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా, నందు ఫైట్స్ సమకూర్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ భాను మాస్టర్, మొయిన్ మాస్టర్ నేతృత్వంలో పాటలు విజువల్ వండర్‌గా రానున్నాయి. ఈ చిత్రానికి పి.ఆర్.ఓలుగా ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్‌గా వివారెడ్డి, కో-డైరెక్టర్‌గా రావుశ్రీ వ్యవహరిస్తున్నారు. శైలజ రెడ్డి నిర్మాణంలో, శివాల ప్రభాకర్ స్క్రీన్ ప్లే – దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రేమకథా చిత్రంపై ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.