కోర్టు రూమ్ డ్రామా ‘డ్యూ డేట్’
కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ‘డ్యూ డేట్' చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతున్నారు.
కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందుతున్న ‘డ్యూ డేట్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా ఫిల్మ్ జర్నలిస్ట్‌గా సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారుతున్నారు. మరో నిర్మాత పవన్ తరిగోపులతో కలిసి వర్షిష్ స్టూడియోస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
లోమేష్ పూడిపెద్ది, జయశ్రీ, ప్రణీత పట్నాయక్, విజ్ఞాని, చందు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఆనంద్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మారుతి క్లాప్‌నివ్వగా, బన్నీ వాస్ కెమెరా స్విఛాన్ చేశారు.
నిర్మాతలు ఎస్కేఎన్, ధీరజ్ మొగిలినేని, వంశీ నందిపాటి దర్శకుడికి స్క్రిప్ట్‌ను అందజేశారు. సమాజంలోని ఓ సీరియస్ ఇష్యూని ఈ సినిమాలో చర్చించబోతున్నామని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కోర్ట్డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని, త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: చెంచు జింక, నిర్మాతలు: ఏలూరు శ్రీను, పవన్ తరిగోపుల, దర్శకత్వం: ఆనంద్.కె.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

