ఈనెల 12న విడుదల అవుతున్న ‘సర్కార్‌వారి పాట’ సినిమా ప్రదర్శనలకు టికెట్ ధరలు స్వల్పంగా పెంచుకునేందుకు వీలుకల్పిస్తూ ప్రభుత్వం అనుమతించింది. ఐమాక్స్, 75ఫీట్లు అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌ల్లో రీైక్లెనర్ సీట్లకు ఒక్కో టికెట్ ధర రూ.50 పెంచేందుకు అనుమతినిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా ఇతర అన్ని ఏసీ థియేటర్లలో టికెట్ల ధరను రూ.30 పెంచేందుకు అనుమతించారు. ఈ అనుమతి ఈనెల 12 నుంచి 18 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అదేవిధంగా ఈనెల 12 నుంచి 18 వరకు ఉదయం 7 నుంచి తెల్లవారుజామున ఒంటిగంట వరకు రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.