Hari Hara Veera Mallu | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పవన్ కళ్యాణ్ ఇటీవల నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిధులను వాడుకుని దుర్వినియోగం చేశారని ఆయన తన పిటిషన్లో ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎస్.విజయ్ కుమార్ హైకోర్టుని కోరారు.
అయితే విజయ్ కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లను చేర్చాల్సిందిగా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.