Gorre Puranam | విలక్షణమైన పాత్రలతో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు టాలీవుడ్ యువ హీరో సుహాస్ (Suhas). గత నెల ‘ప్రసన్నవదనం’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో రీసెంట్గా గొర్రెపురాణం(Gorre Puranam) అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రం విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీ అప్డేట్ పంచుకుంది.
ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా తెలుపుతూ.. పురాణాలందు ఈ ‘గొర్రె పురాణం’ వేరయా! అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా !! అంటూ రాసుకోచ్చారు. ఫోకల్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా.. బాబీ దర్శకత్వం వహించాడు.
పురాణాలందు ఈ ‘గొర్రె పురాణం’ వేరయా!
అక్టోబరు 10 న ఆహాలో వస్తుందయా!!#GorrePuranam Premieres 10th Oct only on aha!@Directorbobby07, @ActorSuhas @pawanch19 @prashan86805501 @sureshsarangam pic.twitter.com/dXsNYi6mUQ— ahavideoin (@ahavideoIN) October 7, 2024