Gopichand | ముహూర్తం కుదిరింది
గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
Gopichand : గోపీచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ నటిస్తున్న 31వ చిత్రమిది. కన్నడ దర్శకుడు ఏ.హర్ష రూపొందిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నిర్మాత కెకె రాధామోహన్ మాట్లాడుతూ…‘మా సంస్థలో నిర్మిస్తున్న 14వ చిత్రమిది. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను నిర్మిస్తున్నాం.
కన్నడలో మంచి విజయాలు సాధించిన దర్శకుడు హర్షతో కలిసి పనిచేస్తుండటం సంతోషంగా ఉంది. త్వరలో ఇతర నటీనటుల వివరాలు వెల్లడిస్తాం. ఈ నెలలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : స్వామి జే, సంగీతం : రవి బస్రూర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

