హీరో గోపీచంద్ కథానాయకుడిగా ‘ఘాజీ’ఫేం సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో.. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ఓ దేవాలయంలో లాంఛనంగా మొదలైంది. 7వ శతాబ్దంలో జరిగే ఓ ముఖ్యమైన, ఇంకా అన్వేషించబడని ఓ చారిత్రక సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందనున్నదని, భారతీయ వారసత్వం మరిచిపోయిన ఓ అధ్యాయానికి జీవం పోసే సినిమా ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో గోపీచంద్ నెవర్ బిఫోర్ రోల్లో కనిపిస్తారని వారన్నారు. ఇంకా ఇతర తారాగణం ఖరారవ్వని ఈ సినిమాకి రచన: సురేష్‌బాబు, ప్రకాష్, కెమెరా: మణికందన్, సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్.