Gopichand – Prabhas | పాన్ ఇండియా నటుడు ప్రభాస్, నటుడు గోపిచంద్‌ల ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వర్షం సినిమా టైంలో మొదలైన వీరిద్దరి స్నేహం ఇప్పుడు ఇంకా బలంగా మారింది. అప్పుడప్పుబు గోపిచంద్ సినిమాలకు వచ్చి తనను సపోర్ట్ చేస్తుంటాడు ప్రభాస్. అయితే వర్షం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషనల్లో మళ్లీ సినిమా రాలేదు. ఈ ప్రభాస్, గోపిచంద్‌ల కాంబోలో సినిమా వస్తే చూద్దామని అటు రెబల్ అభిమానులతో పాటు ఇటు గోపిచంద్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంపై తాజాగా స్పందించాడు గోపిచంద్.
గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం విశ్వం. ఈ సినిమాకు శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గోపిచంద్ మళ్లీ విలన్‌గా నటిస్తారా అని రిపోర్టర్ అడుగగా.. విలన్ రోల్ చేయాలని లేదు. కానీ ప్రభాస్ సినిమాలో అయితే విలన్ రోల్ అయితే తప్పకుండా చేస్తాను అంటూ గోపిచంద్ చెప్పుకోచ్చాడు. దీంతో వీరిద్దరి కాంబో ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నామని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.