గోపీచంద్ సీటీమార్ రిలీజ్ మళ్లీ వాయిదా.. కొత్త డేట్ ఎప్పుడంటే..?

మొన్నటికి మొన్న సెప్టెంబర్ 3న తమ సినిమా వస్తుందని అనౌన్స్ చేశారు సీటీమార్ దర్శక నిర్మాతలు. ప్రకటించిన మూడు రోజుల తర్వాత మనసు మార్చుకున్నారు. ఈ సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాంతో గోపీచంద్ అభిమానులు నిరాశలో మునిగిపోయారు. కరోనా కాస్త తగ్గినట్లు అనిపించినా కూడా ఇప్పటికీ కేసులు బాగానే వస్తున్నాయి. దాంతో కొందరు నిర్మాతలు తమ సినిమాలు ఓటీటీకే ఇస్తున్నారు. సంపత్ నంది తెరకెక్కించిన సీటీమార్ సినిమా కూడా ఓటీటీలో విడుదలవుతుందని మొన్నటివరకు ప్రచారం జరిగినా చివరికి థియేటర్స్‌వైపు అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 3న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పుడు నిర్మాతలు మనసు మార్చుకున్నారు.
సెప్టెంబర్ 3వ తేదీకి బదులు వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న సీటీమార్ సినిమాను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు. నిజానికి ఆ రోజు సాయిపల్లవి, నాగచైతన్య నటించిన లవ్‌స్టోరీ సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఏపీలో నాలుగు షోలకు అనుమతి వచ్చిన తర్వాతనే తమ సినిమాను విడుదల చేస్తామని చెప్పాడు లవ్ స్టోరీ నిర్మాత సునీల్ నారంగ్. ఈ సినిమా వాయిదాతో వినాయక చవితికి డేట్ ఖాళీ అయిపోయింది. దాన్నిప్పుడు గోపీచంద్ భర్తీ చేస్తున్నాడు. సెప్టెంబర్ 10న భారీగా సీటీమార్ విడుదల కానుంది.

లౌక్యం తర్వాత గోపీచంద్ ఖాతాలో ఇప్పటి వరకు మరో హిట్ లేదు. దాంతో ఈయన ఆశలన్నీ ఇప్పుడు సీటీమార్ సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో ఆంధ్ర ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ బాలారెడ్డిగా గోపీచంద్.. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్ జ్వాలా రెడ్డిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు గోపీచంద్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్రీకాంత్ -ఊహా కూతురు వెండితెరకు పరిచయం కాబోతుందా?
Bigg boss 5 | అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు కరోనా.. వార్తలు నిజమేనా..?
పవన్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే వార్త చెప్పిన బండ్ల..ఇక ఆ రోజు సందడే సందడి..!
RRR: అఖిల్ సినిమా రిలీజ్ డేట్‌తో ఆర్ఆర్ఆర్ వాయిదాపై వచ్చిన క్లారిటీ..!
భార్యపై రేప్ నేరం కాదు.. తాప్సీ స్పందన ఏంటంటే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

