ఇటీవలే ‘విశ్వం’ సినిమాతో పలకరించారు హీరో గోపీచంద్. తన తదుపరి సినిమా ఏంటి? అనేదానిపై మాత్రం ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అయితే.. తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ‘ఘాజీ’ఫేం సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో ఆయన ఓ చిత్రం చేయనున్నారట.
ఇటీవలే గోపీచంద్‌కి సంకల్పరెడ్డి ఓ కథ వినిపించారట. అది నచ్చడంతో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట గోపీచంద్. చిట్టూరి శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తున్నది. గోపీచంద్ కెరీర్లోనే ఇది విభిన్నమైన కథ అని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానున్నట్టు సమాచారం.