Gopichandh-Sriwass | ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు తిరుగులేని క్రేజ్ ఉంది. అలాంటి కాంబోలలో ఒకటి గోపిచంద్, శ్రీవాస్. వీళ్ల కాంబోలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు ఏ రేంజ్లో హిట్టయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టాయి. దాంతో మళ్లీ వీళ్ల కాంబో ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని ఎందరో గోపిచంద్ అభిమానులు ఎదురు చూశారు. కాగా తొమ్మిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి రామబాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. మరో వారంలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై జనాల్లో మంచి హైపే నెలకొంది.
ఇక ప్రస్తుతం చిత్రబృందం వరుస ప్రమోషన్లతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే గోపిచంద్‌కు శ్రీవాస్‌కు గొడవలు జరిగినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా వీటిపై గోపిచంద్ స్పందించాడు. తన గొడవలు పడే రకం కాదని, తనకు శ్రీవాస్‌తో ఎలాంటి గొడవలు లేవని గోపిచంద్ తెలిపాడు. రామబాణం సినిమా షూటింగ్ చేస్తుండగా లెంగ్త్ ఎక్కువయ్యే కొన్ని సీన్లు తీయోద్దని చెప్పానట్లు, అయినా శ్రీవాస్ ఆ సీన్లు తీశాడని చెప్పాడు. దాంతో తనకు, శ్రీవాస్‌కు గొడవలు జరిగాయని వార్తలు రాశారని క్లారిటీ ఇచ్చాడు.
ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్ కూడా గతకొంత కాలంగా లైమ్‌లైట్‌లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్, సాక్ష్యం డిజాస్టర్లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో చూడాలి.