తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు గోపీచంద్. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఇటలీలో కీలకమైన షెడ్యూల్ పూర్తయింది. తనదైన శైలి వినోదం, మాస్ యాక్షన్ అంశాలతో దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘విశ్వం’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దర్శకుడు శ్రీనువైట్లకు రెండక్షరాల టైటిల్స్ సెంటిమెంట్ కావడంతో ఇదే టైటిల్ను ఖరారు చేయొచ్చని అంటున్నారు. ఈ సినిమాతో పాటు గోపీచంద్ ప్రస్తుతం ‘భీమా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఏ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతున్నది.