BHIMAA | ఇటీవలే రామబాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand). ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మరోవైపు ఇప్పటికే కన్నడ డైరెక్టర్‌తో ఏ హర్ష (A Harsha)తో సినిమా కూడా ప్రకంటించేశాడు. గోపీచంద్ 31(GopiChand 31) పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కూడా అయింది.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాతో హర్ష టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను లాంఛ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి భీమా (BHIMAA) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గోపీచంద్ ఖాకీ డ్రెస్‌లో రౌద్రరూపం చూపిస్తుండగా.. బ్యాక్ డ్రాప్లో ఎద్దు స్టిల్ కనిపిస్తోంది. గోపీచంద్ ఇదివరకెన్నడూ చేయని పాత్ర చేయబోతున్నట్టు తాజా లుక్‌తో తెలిసిపోతుంది.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. గోపీచంద్ 31కు స్వామి జే సినిమాటోగ్రాఫర్. టాప్ టెక్నీషియన్స్ ఈ సినిమాకు పనిచేయబోతుండగా.. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
We are overwhelmed with this Terrific Response for our #BHIMAA Title reveal & First Look ❤️
The upcoming updates will be much more Massy🔥@YoursGopichand @NimmaAHarsha @RaviBasrur #SamyJGowda @KKRadhamohan@SriSathyaSaiArt #HBDGopichand pic.twitter.com/GT0frmnA2k
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) June 12, 2023
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023