అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయికుమార్, పవన్ రమేశ్, మోనిక బుసం ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘గోపి గాళ్ల గోవా ట్రిప్’. రోహిత్, శశి దర్శకులు. రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంస్థలన్నీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో సినిమా విడుదల కానున్నది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు.
దర్శకులు సాయిరాజేశ్, వెంకటేశ్ మహా, రూపక్ ముఖ్య అతిథులుగా హాజరై ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఇదొక రోడ్ ట్రావెల్ ఫిల్మ్ అనీ, అందర్నీ ఆకట్టుకుంటుందని దర్శకులు తెలిపారు. ఇంకా చిత్రబృందం అంతా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రవి