కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో అలరించే హీరో గోపీచంద్. కమర్షియల్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన డైరెక్టర్ శ్రీనువైట్ల( Sreenu Vaitla ). ఇప్పుడీ ఇద్దరూ తొలిసారి కలసి చేసిన సినిమా ‘విశ్వం’. ఈ ఇద్దరి గత సినిమాలు ఆశించి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో ఈ సినిమాపైనే బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా విశ్వం నాకు, శ్రీనువైట్లకి కమ్‌బ్యాక్ సినిమా అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పారు గోపిచంద్. మరి విశ్వం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యిందా? గోపీచంద్, శ్రీనువైట్ల కి కమ్‌బ్యాక్ మూవీగా నిలిచిందా?
కథ: ఇండియాని నాశనం చేయాలని ఓ తీవ్రవాది కుట్ర పన్నుతాడు. ఆ క్రమంలో ఓ హత్య చేస్తాడు. ఆ హత్యని ఓ పాప చూస్తుంది. దీంతో పాపని చంపడానికి ప్రయత్నిస్తాడు. పాపని రక్షించడానికి గోపి (గోపీచంద్) Gopichand వస్తాడు. అసలు గోపి ఎవరు? ఈ కథలో సమైరా (కావ్యా థాపర్) Kavya Thapar పాత్ర ఏమిటి? గోపి చివరికి ఆ పాపని రక్షించాడా లేదా? అనేది మిగిలిన కథ.
కథా విశ్లేషణ: ఎలాంటి కథనైనా ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చెప్పడం శ్రీనువైట్ల మార్క్. ఈ విషయంలో ఆయనకంటూ ఒక స్టయిల్ ని క్రియేట్ చేసుకున్నారు. ‘విశ్వం’ సినిమా కూడా శ్రీను వైట్ల మార్క్ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. ఆయన గత సినిమాల్లోని హిట్ ఎలిమెంట్స్ అన్నీ ఫార్ములా ప్రకారం రిపీట్ చేయడానికి ప్రయత్నించిన సినిమా ఇది. మిలాన్ లో వచ్చే హీరో హీరోయిన్ ఎపిసోడ్ దూకుడులోని లవ్ ట్రాక్ ని గుర్తుకు తెస్తూ కథ మొదలౌతుంది. హీరో ఐడెంటీటీని దాచేయడం శ్రీనువైట్ల దాదాపు ప్రతి సినిమాలో వుంటుంది. విశ్వంలో కూడా ఆదే పంధాలో వెళ్లారు.
కామెడీ రాయడంలో శ్రీనువైట్ల దిట్ట. విశ్వంలో చెప్పుకోదగ్గ అంశం ఈ కామెడీనే. మరీ హిలేరియస్ గా వచ్చిందని చెప్పలేం కానీ చూస్తున్నంతసేపు టైమ్ పాస్ అయ్యే సీన్స్ అయితే రాసుకోగాలిగారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్-పృద్వీ కామెడీ బ్లాక్స్ బావొచ్చాయి. అవి నవ్వించగలిగాయి. మిగతా కామెడీ గ్యాంగ్ కూడా నవ్వించే ప్రయత్నం చేశారు. అయితే అయితే కథ విషయంలోనే అసలు ఇబ్బంది ఎదురైయింది. కథలో ఒరిజినాలిటీ మిస్ అయ్యింది. ఇందులో దేశభక్తి, తండ్రి కూతురు, తండ్రి కొడుకు, బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్.. ఇలా చాలా ఎమోషన్స్ కనిపిస్తాయి కానీ ఏదీ హత్తుకునేలా వుండదు. కొన్ని ఎమోషన్స్ సహనానికి పరీక్షలా వుంటాయి. కామెడీపై పెట్టిన ద్రుష్టి ఎమోషన్ పై కూడా పెట్టివుంటే ఇంకాస్త బెటర్ గా వుండేది.
నటీనటులు నటన: గోపీచంద్ మాచో హీరో. విశ్వం లాంటి క్యారెక్టర్ ఆయనకి కొట్టినపిండే. ఈ క్యారెక్టర్ ని తనదైన యీజ్ తో చేశారు. యాక్షన్ లో తన మార్క్ చూపించారు. కావ్యథాపర్ గ్లామరస్ గా వుంది. అయితే ఆమె క్యారెక్టరైజేషన్ అంతగా వర్క్ అవుట్ కాలేదు. వెన్నెల కిషోర్-పృద్వీ అలరించారు. వాళ్ళ సీన్స్ కావాల్సిన కామెడీ పంచాయి. నరేష్, ప్రగతి, వీటీ గణేష్ తో పాటు మిగతా నటీనటులు పరిధిమేరకు రాణించారు.
టెక్నికల్: చేతన్ భరద్వాజ్ పాటలు మాస్ ని అలరించేలా వున్నాయి. బీజీఎం కూడా కమర్షియల్ కొలతలకి తగ్గట్టుగా చేశాడు. గుహన్ కెమరాపని తనం డీసెంట్ గా వుంది. ఎడిటింగ్ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. ముఖ్యంగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ని షార్ఫ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు రిచ్ గా వున్నాయి. ఫారిన్ లోకేషన్స్ లో తీసిన సన్నివేశాలు గ్రాండ్ గా కనిపించాయి. నిర్మాతలు ఖర్చుకి వెనకాడలేదు.
ప్లస్ పాయింట్స్
గోపీచంద్ యాక్షన్
శ్రీను వైట్ల మార్క్ కామెడీ
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
కొత్తదనం లేని కథ, కథనం
రొటీన్ ఎలిమెంట్స్
రేటింగ్ : 2.75/ 5
“Kavya Thapar | కత్తిలాంటి ఫోజులతో కైపెక్కిస్తున్న కావ్య థాపర్”
“Kavya Thapar | డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్లో రెడ్ మిర్చీలా ఘాటెక్కిస్తున్న కావ్య థాపర్ ఫొటోలు”
“Srinu Vaitla | ఆరేండ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణం అదే : శ్రీనువైట్ల”