Srinu Vaitla | టాలీవుడ్ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం విశ్వం. గోపిచంద్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల మాట్లాడుతూ.. ఇన్నిరోజులు గ్యాప్ తీసుకోవడానికి గల కారణాలు వెల్లడించాడు.
ఈ మధ్య ప్రేక్షకులు కొత్త కథలను కోరుకుంటున్నారు. అయితే నేను మూవీ తీసే విధానం, ఎంటర్టైనమెంట్ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. కానీ అన్ని సినిమాలలో ఒకటే థీమ్ ఉంటుందని తెలిపారు. దానివల్ల ఏ సినిమాలో కామెడీ ఒకేరకంగా ఉంటుంది. అందుకే కొన్నిరోజులు గ్యాప్ తీసుకోని వర్క్ చేశా. సరికొత్త థీమ్ తీసుకోని దానికి కామెడీ జోడించడం మాములు విషయం కాదు. నేను అలానే చేయాలని ఫిక్స్ అయ్యి విశ్వం తెరకెక్కించాను. ఈ సినిమా అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా ఇది అంటూ శ్రీనువైట్ల చెప్పుకోచ్చాడు.