Captain Miller | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush) టైటిల్ రోల్ పోషించిన చిత్రం కెప్టెన్ మిల్లర్ (Captain Miller). తమిళనాడులో థియేటర్లలో జనవరి 12న గ్రాండ్గా విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో జనవరి 25న విడుదల కానుంచి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధనుష్ అభిమానులు, మూవీ లవర్స్ కోసం ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు మేకర్స్.
జనవరి 25న సాయంత్రం కెప్టెన్ మిల్లర్ స్పెషల్ పెయిడ్ ప్రీమియర్స్ ను వేయనున్నట్టు తెలియజేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేయబడ్డ థియేటర్లలో కెప్టెన్ మిల్లర్ స్పెషల్ ప్రీమియర్ ఉండనున్నట్టు ప్రకటించారు. నీలాగా నేను కూడా ఓ హంతకురాలినై ఉంటే.. వాడిని నేనే చంపేవాడిని.. ప్రియాంక మోహన్ చెబుతున్న సంభాషణలతో సాగుతున్న ట్రైలర్.. తెల్లదొరలకు వ్యతిరేకంగా కెప్టెన్ మిల్లర్ అండ్ టీం ఎలా పోరాడిందనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సురేశ్ ప్రొడక్షన్స్, ఏసియన్ సినిమాస్ గ్రాండ్గా విడుదల చేస్తున్నాయి.
విప్లవయోధుడు కెప్టెన్ మిల్లర్ స్పూర్తితో వస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, టాలీవుడ్ యాక్టర్ సందీప్ కిషన్, నివేదితా సతీశ్, ఎడ్వర్డ్ సొన్నెన్బ్లిక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. సత్య జ్యోతి ఫిలిమ్స్ తెరకెక్కించిన కెప్టెన్ మిల్లర్ ఇప్పటికే తమిళనాడుతోపాటు కేరళ, కర్ణాటక, ఓవర్సీస్లో తన సత్తా చాటుతూ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.
. #CaptainMillerTelugu to have Paid Premieres Across AP & TG in selected theatres on Jan 25th Evening!
Book Your Tickets Now
🎟 https://t.co/h0nmvDvMwBRelease by @AsianCinemas_ & @SureshProdns On January 26th 💥@dhanushkraja #ArunMatheswaran @sundeepkishan @priyankaamohan pic.twitter.com/FpcEwYrOJD
— Sathya Jyothi Films (@SathyaJyothi) January 23, 2024
కెప్టెన్ మిల్లర్ ట్రైలర్..
Here’s the @dhanushkraja‘s Massive action extravaganza #CaptainMillerTelugu Trailer!
Grand Release By @AsianCinemas_ and @SureshProdns on JANUARY 25th💥#ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi… pic.twitter.com/eZunYljjGZ
— BA Raju’s Team (@baraju_SuperHit) January 17, 2024
#CaptainMiller is set for a grand release in Andhra Pradesh and Telangana by @SureshProdns and @AsianCinemas_ 🔥
Releasing in theatres on Jan 25th!@dhanushkraja #ArunMatheswaran @gvprakash @NimmaShivanna @sundeepkishan @priyankaamohan @SathyaJyothi pic.twitter.com/GuZDej5Q5W
— Suresh Productions (@SureshProdns) January 12, 2024
కెప్టెన్ మిల్లర్ టీజర్..