Adhik Ravichandran – Balakrishna | “గుడ్ బ్యాడ్ అగ్లీ” లాంటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్. టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణతో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఫిల్మ్ నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తమిళంలో “మార్క్ ఆంటోని” లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన అధిక్ ఆ తర్వాత “గుడ్ బ్యాడ్ అగ్లీతో అజిత్ కుమార్‌కి బ్లాక్ బస్టర్‌ను అందించాడు. అయితే తాజాగా బాలయ్యతో అధిక్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
బాలయ్య బాబు మాస్ ఇమేజ్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్ కలగలిస్తే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి బాలయ్యకి అధిక్ కథ చెప్పినట్లు తెలుస్తుంది. బాలయ్య కూడా అధిక్ చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. కాగా దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు అధిక్ అజిత్ తోనే తన తర్వాత సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.