Godzilla x Kong | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హాలీవుడ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజువల్ వండర్ గా తెరకెక్కే ఈ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాలను అందుకోవడమే కాదు.. భారీ వసూళ్లను కూడా రాబడుతూ రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి. అయితే ఈ కోవాలోకే వస్తాయి గాడ్జిల్లా చిత్రాలు.
మాన్స్టర్ యూనివర్స్‌లో భాగంగా ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజీ నుంచి 4 సినిమాలు రాగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న తాజా చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్. ఆడమ్ విన్ గార్డ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లెజెండరీ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో రెబెక్కా హాల్, బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కైలీ హాట్ల్, అలెక్స్ ఫెర్న్స్, ఫాలా చెన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ 12 2024న ఇంగ్లీష్, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.