మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గాడ్‌ఫాదర్’ చిత్ర యూనిట్ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపింది. ‘మీ కష్టాలన్నీ ఒక రోజుకు తీరతాయి. గాడ్‌ఫాదర్ టీం నుంచి ప్రతి ఒక్కరికీ విజయదశమి శుభాకాంక్షలు’ అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ క్రమంలో దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక పోస్టర్‌ను మూవీ టీం విడుదల చేసింది.
చీకటిలో నిలబడి ఉన్న మెగాస్టార్ అవుట్‌లుక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మలయాళంలో భారీ హిట్‌గా నిలిచి, తెలుగులో కూడా మంచి మార్కులు సాధించిన ‘లూసిఫర్ సినిమాను ‘గాడ్‌ఫాదర్’గా మెగాస్టార్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహనరాజా దర్శకత్వం వహిస్తుండగా, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
All your troubles will end one day! 🏹Team #GodFather wishing everyone a Happy Vijaya Dashami🎉#Megastar @Kchirutweets @jayam_mohanraja @alwaysramcharan @KonidelaPRO #RBChoudary @ProducerNVP @SuperGoodFilms_@MusicThaman @sureshsrajan#HappyDussehra pic.twitter.com/qtemaCtMzf
— BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2021