మనందరి జీవితాల్లోని కథ
‘గోదారి గట్టుపైన’ సినిమా కథ మనందరి జీవితాల్లో చూసినట్లుగానే ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాత్రలతో కనెక్ట్ అవుతారని చెప్పారు దర్శకుడు సుభాష్‌చంద్ర. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటించారు.
‘గోదారి గట్టుపైన’ సినిమా కథ మనందరి జీవితాల్లో చూసినట్లుగానే ఉంటుందని, ప్రతి ఒక్కరూ పాత్రలతో కనెక్ట్ అవుతారని చెప్పారు దర్శకుడు సుభాష్‌చంద్ర. ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో సుమంత్ప్రభాస్ హీరోగా నటించారు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం సుభాష్‌చంద్ర విలేకరులతో మాట్లాడారు. ‘నా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా రేలంగి. బిటేక్ రోజుల నుంచే షార్ట్‌ఫిల్మ్స్ తీయడం అలవాటు.
ఇప్పటికీ 80 షార్ట్‌ఫిల్మ్స్ చేశా’ అన్నారు. గోదావరి నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇదని, హీరో సుమంత్ప్రభాస్ గోదావరి యాసను పర్ఫెక్ట్గా పలికారని, అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని తెలిపారు. ‘ప్రతీ తండ్రికి తన కూతురిని తనకంటే గొప్పవ్యక్తికి ఇవ్వాలని ఉంటుంది. ఇది ఆయన ప్రేమలోని నిజం. అలాగే అబ్బాయి ప్రేమలో కూడా నిజం ఉంటుంది.
ఈ సంఘర్షణల మధ్య సాగే ప్రేమప్రయాణమిది. ఈ కథను చాలా పరిణతితో చెప్పే ప్రయత్నం చేశా. జగపతిబాబు, లైలా పాత్రలు సినిమాకు వెన్నెముక’ అని సుభాష్‌చంద్ర అన్నారు. దర్శకత్వంలో తనకు స్టీవెన్ స్పీల్బర్గ్ స్ఫూరి అని, ‘జురాసిక్ పార్క్’ చూసినప్పటి నుంచే సినిమాలపై ఆసక్తిపెరిగిందన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

