Nandamuri Balakrishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ-2: తాండవం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విజయంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్లో ఉంది. ఈ సందర్భంగా బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజాగా పవిత్ర పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించారు. సినిమా బ్లాక్బస్టర్ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా వారు కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న అనంతరం, వీరు గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. “హర హర మహాదేవ్” అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయిన వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద తాండవం: ‘అఖండ-2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. మొదటి భాగం కంటే రెట్టింపు స్థాయిలో యాక్షన్, ఎమోషన్ మరియు దైవత్వం ఉండటంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.