Globe Trotter | మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. గత కొద్ది రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా దూసుకెళుతోంది. భారీ బడ్జెట్‌తో, మహేష్ కెరీర్లోనే అత్యంత పెద్ద ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్లోబ్‌ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక అప్డేట్స్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనున్న గ్రాండ్ ఈవెంట్లో రానున్నాయి.
అయితే ఈ ఈవెంట్‌కి సంబంధించిన ఏ వార్త అయిన క్షణాలలో వైరల్ అవుతుంది. ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం చిత్రబృందం ప్రత్యేకంగా “పాస్‌పోర్ట్ స్టైల్” పాస్‌లను రూపొందించింది. ప్రస్తుతం ఇవిసోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. పాస్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రీలుక్‌లో మహేష్ బాబు మెడలో కనిపించిన త్రిశూలం లోగో ఆధారంగా ప్రత్యేక డిజైన్ చేశారు. లోపల మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫొటోలు ఉన్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్, మ్యాప్, ప్రవేశ సూచనలు కూడా అందులో పొందుపరిచారు.పసుపు రంగు అట్టతో, చూడటానికి అచ్చం అసలైన పాస్‌పోర్ట్‌లాగే కనిపిస్తుండడం దీని ప్రత్యేకత
దానిపై “GLOBETROTTER EVENT” అని, “PASSPORT” అని స్పష్టంగా ముద్రించి ఉంది. ఈ కొత్త ఐడియా చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఐడియా వెనుక కేవలం క్రియేటివిటీ మాత్రమే కాదు, పక్కా స్ట్రాటజీ కూడా ఉందని కామెంట్ చేస్తున్నారు ‘పాస్‌పోర్ట్’ అనడం వల్ల దానికి ఒక స్పెషల్ వాల్యూ, థీమ్ యాడ్ అయ్యింది. ఇక రీసెంట్గా రాజమౌళి ఓ వీడియోని విడుదల చేసి అందులో పాస్ ఉన్న వారినే ఈవెంట్‌కు అనుమతిస్తారు. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న తప్పుడు వార్తలను నమ్మవద్దు అని అభిమానులను అప్రమత్తం చేశారు. ఇక ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా ‘మందానికి’ పాత్రలో కనిపించి అలరించనుంది.ఇక రీసెంట్గా విడుదల చేసిన ‘సంచారీ’ పాట సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. శ్రుతి హాసన్ ఆలపించిన ఈ భావగీతం ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.