మొహమాటం తీసుకొచ్చిన ఇబ్బందులే ప్రధాన ఇతివృత్తంగా రూపొందుతున్న కామెడీ ఎంటైర్టెనర్ ‘గప్ చుప్ గణేశా’. రోషన్, రిదా జంటగా నటిస్తున్నారు సూరి.ఎస్ దర్శకుడు. కె.ఎస్.హేమ్రాజ్ నిర్మాత. త్వరలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
నిర్మాత కె.ఎల్.దామోదరప్రసాద్ ట్రైలర్‌ని లాంచ్ చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మతంగా సాగింది. అన్ని వర్గాలకూ నచ్చే సినిమా ఇదని దర్శక, నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు ఆనందం వెలిబుచ్చారు. అంబటి శ్రీనివాస్, గడ్డం నవీన్, అశోక్ వర్ధన్, సోనాలి పాణిగ్రహి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అంగత్ కుమార్, సంగీతం: శ్రీతరుణ్.