కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘ఘోస్టీ’. కల్యాణ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నది. ఉగాది సందర్భంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా, పోలీసాఫీసర్‌గా ద్విపాత్రాభినయం చేశారు.
ఆత్మలకు, కాజల్ పోషించిన పాత్రలకు ఉన్న సంబంధం ఏమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. వినోదంతో పాటు ఆద్యంతం సస్పెన్స్ ప్రధానంగా సాగే చిత్రమిది’ అన్నారు. కె.ఎస్.రవికుమార్, రిడిన్ కింగ్స్లే, తంగదొరై, జగన్, ఊర్వశి, సత్యన్, ఆడుకాలం నరేన్, మనోబాల, రాజేంద్రన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు.