Ghoomer Movie | బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ (Abhishek Bachan) ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం ఘూమర్ (Ghoomar). చీనీ కమ్(Cheeni Cum), పా (Paa), షమీతాబ్ (Shamithab), ప్యాడ్ మాన్ (Padman), కీ అండ్ కా(Ki & Ka) వంటి చిత్రాల ఫేం ఆర్. బాల్కి (R Balki) ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కథనాయికగా సయామి ఖేర్ (Saiyami Kher) నటించింది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో దివ్యాంగురాలైన ఓ క్రీడాకారిణిని విజయవంతమైన క్రికెటర్గా మార్చే కోచ్ పాత్రలో అభిషేక్ బచ్చన్ కనిపించనున్నాడు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా చూసిన టీమ్ఇండియా మాజీ లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (Ghoomer) స్పందించిన విషయం తెలిసిందే. ”నేను ఘూమర్ (Ghoomar Movie)ని చూశాను. నాకు బాగా నచ్చింది. ఇందులో క్రికెట్ మాత్రమే కాదు భావోద్వేగాలు కూడా ఉన్నాయి అంటూ సచిన్ తెలిపాడు. తాజాగా దీనిపై నటి సయామి ఖేర్ ఓ వీడియో విడుదల చేసింది.
”మీకు చిన్నప్పుడు అస్సలు ఎప్పటికి తీరని కోరిక ఒకటి ఉందా. నాకు సచిన్ను కలవడం అలాంటి కోరికే.
నా హీరో, నా స్ఫూర్తి, నా గురువు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సచిన్ను చూసే ఈ ఆట నేర్చుకున్నాను” అంటూ సయామీ తెలిపింది. దీనితో పాటు సచిన్, సయామి కలిసి మాట్లాడుతున్న వీడియోను సోషల్ మీడియాలో సయామి షేర్ చేసింది.
What’s the one dream you had as a child that you never thought could never come true? Mine was that someday, I would get to meet @sachin_rt my hero, my inspiration, my teacher. I have loved and learnt this game watching him play. pic.twitter.com/HKEe22anF3
— Saiyami Kher (@SaiyamiKher) August 22, 2023
Really enjoyed watching #Ghoomer by #RBalki. It was truly inspirational and should be watched by all youngsters. @juniorbachchan was fantastic as the Coach, @SaiyamiKher looked very authentic, her love for Cricket and her ability to understand the character was amazing.… pic.twitter.com/2YW4iEfGwG
— Sachin Tendulkar (@sachin_rt) August 21, 2023