Ghatikachalam Trailer | నిఖిల్ దేవాదుల (Nikhil Devadula) కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఘటికాచలం’ (Ghatikachalam). సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ సినిమాకు అమర్ కామెపల్లి దర్శకత్వం వహిస్తుండగా.. ఎం.సి.రాజు నిర్మించారు. ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి వంటి తారలు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా, నిఖిల్ దేవాదుల నటన, ఆయన పలికిన డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌ను ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్. మరియు స్టార్ డైరెక్టర్ మారుతి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుండటం విశేషం.