మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం గని. సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. ఖాళీగా దొరికిన సమయంలోనూ వరుణ్ తేజ్ రెస్ట్ తీసుకోకుండా బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. వరుణ్ తేజ్ తన ట్రాన్సఫర్మేషన్కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు.
మరోవైపు చిత్ర బృందం దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో వరుణ్,మంజ్రేకర్ జంట చూడముచ్చటగా ఉంది. గని టైటిల్ సాంగ్కు తమన్ కొట్టిన మ్యూజిక్కు అందరూ ఫిదా అయ్యారు. డిసెంబర్ 3న గని రాబోతోంది. ఇక వరుణ్ నటించిన మరో చిత్రం ఎఫ్ 3 సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కాబోతోంది.
⚡️🤨⚡️ pic.twitter.com/AwiTJjvy6Z
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 3, 2021