Ghani movie | మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పణలో అల్లుబాబీ,సిద్దు ముద్ద కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం పలుసార్లు వాయిదాపడుతూ వస్తుంది. గత సంవత్సరం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాని పుష్ప, శ్యామ్ సింగరాయ్ వంటి సినిమాలు పోటిగా ఉండటంతో చిత్రాన్ని వాయిదా వేసారు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.
గని చిత్రాన్ని ఫిబ్రవరి25 న లేదా మార్చి4 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా భీమ్లానాయక్ చిత్రాన్ని కూడా ఫిబ్రవరి25 లేదా ఎప్రిల్ 1న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇక బాబాయ్ అబ్బాయిలు ఓకే సారి ప్రేక్షకులను పలకరిస్తారా లేదా అనేది తెలియాల్సింది. ఒక వేళ భీమ్లానాయక్ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైతే గని డ్రాప్ అవుతుందని టాక్. అందుకే గని మేకర్స్ రెండు డేట్లను ప్రకటించినట్లు సమాచారం.
గని చిత్రంలో బాక్సర్ పాత్రలో వరుణ్ నటించనున్నాడు. ఇక ఈ చిత్రం కోసం వరుణ్ బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నాడు..సాయిమంజ్రేకర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర, నదియా కీలక పాత్రలో నటించనున్నారు.ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, గని టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈచిత్రానికి సినిమాటోగ్రఫి జార్జ్ సీ విలియమ్స్, ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్.