Ghaati | లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి తన కెరీర్ స్పీడ్ పెంచింది. రెండు సంవత్సరాల క్రితం వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి విజయాన్ని అందుకుని, ఆమెకు మళ్లీ బజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు అనుష్క మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ‘ఘాటి'(Ghaati). ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు క్రిష్ జాగర్లమూడి. ఈ క్రేజీ కాంబినేషన్ గతంలో వేదం సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఓ ప్రత్యేక స్థానం ఏర్పరిచింది. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ ఘాటి కోసం జతకట్టారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా కోసమే క్రిష్ తన మరో సినిమా హరిహర వీరమల్లును తాత్కాలికంగా విరమించాడన్న వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్లో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది.విలేజ్ మహిళా మాస్ అవతార్‌లో అనుష్క లుక్ బాగుంది. ఆమె యాక్షన్ సీక్వెన్సెస్‌లో అదరగొట్టింది. ట్రైలర్ మొత్తం కూడా యాక్షన్ డ్రాప్లోనే సాగింది. చివరలో సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూద్దురు కానీ.. అనే పవర్ ఫుల్ డైలాగ్ వినిపించింది. మిగతా డైలాగ్స్ కూడా చాలా పవర్ ఫుల్‌గా ఉన్నాయి.మూవీని సెప్టెంబర్ 5, 2025న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ట్రైలర్ ద్వారా తెలియజేశారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీతో అనుష్క మరో భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
విక్రమ్ ప్రభు, అనుష్క శెట్టి ప్రధాన పాత్రలలో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బేనర్‌పై తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని, సినిమా పట్ల అంచనాలను హైకు తీసుకెళ్లాయి. ముఖ్యంగా అనుష్కను మరో కోణంలో చూపించేందుకు క్రిష్ తీసుకున్న ఈ కొత్త ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో రిలీజ్ డేట్‌కు సంబంధించి ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు.మొత్తానికి ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కానుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.