కథే హీరోగా ఆత్మకథ
జెమినీ సురేశ్, అఖిల నాయర్ జంటగా ‘ఆత్మకథ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వారాహి ఎంటైర్టెన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.
జెమినీ సురేశ్, అఖిల నాయర్ జంటగా ‘ఆత్మకథ’ పేరుతో ఓ చిత్రం రూపొందుతున్నది. శ్రీనివాస్ గుండ్రెడ్డి దర్శకుడు. వారాహి ఎంటైర్టెన్మెంట్ ప్రై.లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో జెమినీ సురేశ్ తల్లి జెమిని సుబ్బలక్ష్మి క్లాప్ ఇవ్వగా, టి.ప్రసన్నకుమార్, జెమినీ కిరణ్ కెమెరా స్విచాన్ చేశారు. సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులంతా ఆకాంక్షించారు. ‘18ఏండ్ల నా కల నేటికి నెరవేరుతున్నది. ఒక మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనుకున్నాను.
ఆ అవకాశం ఈ ‘ఆత్మకథ’ చిత్రంతో దక్కింది.’ అని జెమినీ సురేశ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో భాగమైనందుకు కథానాయిక అఖిల సంతోషం వెలిబుచ్చారు. కథే ఈ సినిమాకు హీరో అని, జెమినీ సురేశ్, సమ్మెట గాంధీ ఈ కథకు రెండు పిల్లర్స్ వంటివారని దర్శకుడు శ్రీనివాస్ గుండ్రెడ్డి తెలిపారు. ఇంకా సమ్మెట గాంధీ, సంగీత దర్శకుడు శ్రేయాస్ కూడా మాట్లాడారు. బలగం విజయలక్ష్మి, చిన్ను, ధనరాజ్, తాగుబోతు రమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎం.వి.గోపి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

