Geetha Madhuri | టాలీవుడ్ స్టార్ సింగర్ గీతా మాధురి మరోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న పండంటి మగ బిడ్డకు జన్మను ఇచ్చినట్టుగా గీతా మాధురి ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ బాబుకి బారసాల కార్యక్రమం నిర్వహించారు నందు – గీతా మాధురి దంపతులు. ఇక ఆ బాబుకు టాలీవుడ్ స్టార్ హీరో పేరు కలిసొచ్చేలా నామకరణం చేశారు. గీతా బాబు పేరు ‘ధృవధీర్ తారక్’(Dhruvadhir Tarak) అని పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకకు సంగీత దర్శకుడు కళ్యాణ్ మాలిక్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
గీతాకు మొదటగా ప్రకృతి పుట్టగా.. ఈ సారి మగ బిడ్డకు జన్మను ఇచ్చింది. టాలీవుడ్ నటుడు నందు, గీతా మాధురి ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 2014లో వీరి పెళ్లి జరుగగా.. 2019 పాపకు జన్మనిచ్చారు. ఇప్పుడు రెండోసారి మగ బిడ్డకు జన్మనిచ్చారు గీతామాధురి.