Enai Noki Paayum Thota | తమిళ అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon) మళ్లీ మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా మెగాఫోన్ వదిలేసి నటుడిగా రాణిస్తున్న ఈ దర్శకుడు తాజాగా మమ్ముట్టి (Mamootty)తో ‘డొమినిక్ అండ్ లేడీస్ పర్స్'(Dominic and the Ladies’ Purse) అనే మలయాళ సినిమా తెరకెక్కిస్తున్నాడు. మమ్ముట్టి ఇందులో డొమినిక్ అనే డిటెక్ట్వ్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జనవరి 23 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు గౌతమ్ మీనన్.
అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా.. మీడియా గౌతమ్‌ని ధనుష్ మూవీ గురించి ప్రస్తవించగా.. ఆ సినిమా నేను తీయలేదని దాని గురించి అడగకండి అని తెలిపాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘ఎనై నోకి పాయుమ్ తోట’ (Enai Noki Paayum Thota) (తెలుగులో తూటా). యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2016లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకోగా అనుకొని కారణాల వలన విడుదల కాలేదు. అయితే నిర్మాతలు ఈ చిత్రాన్ని మళ్లీ 2019లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. డిజాస్టర్ అందుకుంది. ఈ సినిమాను ధనుష్ కూడా డైరెక్ట్ చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి గౌతమ్ తప్పుకున్నట్లు టాక్ నడిచింది.
అయితే ఈ సినిమాకు సంబంధించి గౌతమ్ మాట్లాడుతూ.. మీరు ఏ సినిమా గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావాట్లేదు. అది నా సినిమా కాదు. ఆ సినిమాను నేను ఎప్పుడో మర్చిపోయాను. అందులో ఒక పాట మాత్రమే గుర్తుంది అంటూ గౌతమ్ చెప్పుకోచ్చాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
🎥 Gautham Menon denies #ENPT– Not my film! 👀
“Enai Nokki Paayum Thotta wasn’t my film. It was someone else’s!” 😅 – @menongautham drops a surprising statement in a recent interview.
Is he hinting at #Dhanush’s involvement? 🤔#GauthamVasudevMenon #GVM pic.twitter.com/Bc7OQfOri8
— Kollywood Now (@kollywoodnow) January 19, 2025