Baahubali: The Epic | రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి రేపు రీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. రెండు పార్టులను కలిపి ఒకే పార్టుగా బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో విడుదల చేయబోతున్నారు. అయితే ఇండియాలో అక్టోబర్‌లో 31న రాబోతుండగా.. ఓవర్సీస్లో ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్‌ని ప్రదర్శించారు మేకర్స్. అయితే తాజాగా ఈ ప్రీమియర్‌ను చూసిన మహేశ్ బాబు కుమారుడు గౌతమ్ సినిమాపై ప్రశంసలు కురిపించడంతో పాటు గూస్ బంప్స్ వచ్చాయంటూ తెలిపాడు.
”ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీన్‌పై ‘బాహుబలి: ది ఎపిక్’ని చూడటం ఎప్పటికీ మరచిపోలేని అనుభవం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ఆసక్తి కోసం రెండేళ్లు ఎదురుచూడాల్సిన రోజులు ఇప్పుడు లేవు. ఎడిట్ చేసిన ఈ రీ-రిలీజ్ వెర్షన్ మరింత సూపర్‌గా ఉంది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ఇంతటి ఆదరణ లభించడం గర్వంగా ఉంది. ఈ సినిమా చూస్తుంటే గూస్బంప్స్ వచ్చాయి, ఇది నిజంగా అద్భుతం (epic) క్రేజీ ఎక్స్పీరియన్స్! అని గౌతమ్ చెప్పుకోచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలోనే గౌతమ్‌ని రిపోర్టర్ అడుగుతూ.. ‘SSMB29’ గురించి అడుగగా.. ఆ విషయం గురించి తనను అడగొద్దని నవ్వుతూ చెప్పుకోచ్చాడు.