ఎస్.ఎస్.దుశ్యంత్, అషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఫాంటసీ డ్రామా ‘గత వైభవ’. సింపుల్ సుని దర్శకుడు. నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం ఈ సినిమా నుంచి ‘వర్ణమాల’ అనే పాటను విడుదల చేశారు. చరిత్ర, పౌరాణికం, సనాతన ధర్మం తాలూకు అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని..కన్నడ, తెలుగు భాషల్లో షూటింగ్ చేశామని హీరో దుశ్యంత్ తెలిపారు.
తన కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రమిదని, ఇందులో నాలుగు విభిన్నమైన కథలుంటాయని కథానాయిక అషికా రంగనాథ్ చెప్పింది. ఇప్పటివరకు రాని సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా తీశామని దర్శకుడు సింపుల్ సుని అన్నారు. సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ పతాకాలపై దీపక్ తిమ్మప్ప, సుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.