ఆశ్చర్యపరిచే అంశాలతో..
లక్ష్, వేదిక దత్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈనెల 24న విడుదల కానున్నది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు.ఎ సర్టిఫికెట్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ..‘ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజ హీరోలు నటించిన సంస్థ మాది. ప్రస్తుతం దాదాపు పదిహేను చిత్రాలను నిర్మిస్తున్నాం. ఇవన్నీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్ ఇచ్చారు. హీరోయిన్ పాత్ర ఆకట్టుకుంటుంది. ముగింపు సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల చేస్తున్నాం’అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

