Game Changer | రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయంరానే వచ్చేసింది. ‘గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్‌ను న్యూ ఇయర్ కానుకగా జనవరి 02 సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్, దిగ్గజ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్‌తో రాబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియార అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. సునీల్, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.
The most awaited announcement from #GameChanger is here! 💥
Get ready to witness the king in all his glory! 😎❤️🔥#GameChangerTrailer from 2.1.2025!Let The Games Begin!#GameChangerOnJanuary10🚁 pic.twitter.com/eOyXDCtJRt
— BA Raju’s Team (@baraju_SuperHit) January 1, 2025