Game Changer | ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఆచార్య సినిమా వచ్చిన ఈ సినిమా డిజాస్టార్ అవ్వడంతో వారి ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న గేమ్‌ఛేంజర్ (Game changer) పైనే ఉన్నాయి. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
అయితే మూవీ నుంచి ఇప్పటికే టీజర్‌తో పాటు రెండు పాటలను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా థర్డ్ సింగిల్ అప్డేట్ను వెల్లడించారు మేకర్స్. ఈ మూవీలోని థర్డ్ సింగిల్‌ను నవంబర్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ మూవీలో కన్నడ నటుడు జయరాయ్, సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Third single from #GameChanger coming your way on Nov 28th 😊💜@shankarshanmugh @advani_kiara @MusicThaman @SVC_official @ZeeStudios_ @saregamaglobal pic.twitter.com/AfMJMXxRJe
— Ram Charan (@AlwaysRamCharan) November 24, 2024