Game Changer Team – Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు(88) కన్నుమూశారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. ఇక రామోజీరావు మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ టీమ్(Game Changer) కూడా సంతాపం ప్రకటించింది. రాజమండ్రిలో గేమ్ ఛేంజర్ దర్శకుడు శంకర్, నటుడు రామ్ చరణ్ సునీల్, తదితరులు రామోజీ రావుకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఒక వీడియో కూడా విడుదల చేసింది.
రాజమండ్రిలో శంకర్ – రామ్ చరణ్ రామోజీ రావుకు నివాళులర్పిస్తూ మౌనం పాటించారు#Ramcharan #Gamechanger #RamojiRao pic.twitter.com/nQhxBlWayw
— Vamsi Kaka (@vamsikaka) June 8, 2024