Game Changer | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో గేమ్‌ఛేంజర్ (Game changer) ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను 2024 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
అయితే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ను పంచుకుంది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చా మచ్చా’ (Raa Macha Macha) అనే పాట ప్రోమోను సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే ఫుల్ సాంగ్‌ను ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది మాత్రం ప్రకటించలేదు. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటకు థమన్ సంగీతం అందించాడు.
The festivities begin! ✨🎉 Second single promo #RaaMachaMacha (Telugu & Tamil) #DamTuDikhaja (Hindi) from #GameChanger is arriving on 28th September!
Brace yourself for the beats and excitement! 🥁🎶
Global Star @AlwaysRamCharan @shankarshanmugh @iam_SJSuryah @advani_kiara… pic.twitter.com/YW7MQ42Lz3
— Sri Venkateswara Creations (@SVC_official) September 25, 2024
ఇక ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.