Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej), దిగ్గజ దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ చేసిన టీం తాజాగా టీజర్ కూడా విడుదల చేసింది. ఈ టీజర్ యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. మూవీ టీం ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు తాడేపల్లిగూడెం, కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో ఈ వేడుకను జరుపనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ చిత్రబృందం బిగ్ అప్డేట్ను వెల్లడించింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఇండియాలో కాకుండా అమెరికాలోని కర్టిస్ కల్వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ గార్లాండ్‌లో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో మొట్టమొదటి సారిగా ఒక ఇండియన్ సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతుడంతో ఈ రికార్డును సాధించిన మొదటి ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించనుంది.
‘Mega MASS’ive Event in the USA 🇺🇸 💥
The pre-release event of #GameChanger will happen in the USA – the first time ever for an Indian cinema 🔥
📍 Curtis Culwell Center, 4999 Naaman Forest Garland TX 75040
🗓️ 21st DEC, 6:00 PM ONWARDSSee you soon, America!
Event By :… pic.twitter.com/GpvapBOJQ4— Sri Venkateswara Creations (@SVC_official) November 22, 2024