Shankar | మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం శంకర్ మీద గుర్రుగా ఉన్నారు. అందరు హీరోల సినిమాలకు సంబంధించిన అప్డేట్లు చక చకా వస్తుంటే గేమ్ చేంజర్ సినిమా అప్డేట్లు మాత్రం రావడం లేదని కాస్త కోపంగానే ఉన్నారు. పైగా ఇండియన్-2ను తొందరగా పూర్తి చేయాలనే తపనలో శంకర్ ఉన్నాడని.. గేమ్ చేంజర్ సినిమాను పట్టించుకోవడం లేదని మెగా అభిమానులు అంటున్నారు. దానికి తోడు గత రెండు మూడు రోజులుగా ఈ ప్రాజెక్ట్‌లోకి హిట్ సిరీస్ దర్శకుడు సైలేష్ కొలను వచ్చినట్లు వార్తలు రావడంతో అందరు అయోమయంలో పడిపోయారు.
అయితే కేవలం సైలేష్ సెకండ్ యూనిట్‌కు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే చూసుకుంటాడని, అది కూడా శంకర్ పర్వక్షణలో అని తెలియాగానే హమ్మయ్య అనుకున్నారు. కాగా తాజాగా శంకర్ నుంచి ఓ భారీ అప్డేట్ వచ్చింది. భారీ ఫైట్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు రెడీ అయినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించాడు. కాగా బుధవారం నుంచి ఈ సినిమా మేజర్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి సమ్మర్ కంటే ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు పిజ్జా, జిగార్తాండ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన కార్తిక్ సుబ్బరాజు కథ అందించాడు. చరణ్‌కు జోడీగా కియరా అద్వానీ, అంజలీలు నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సునీల్, ఎస్.జే సూర్య కీలకపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ స్వరాలందిస్తున్నాడు.
Jumping right into a riveting fight sequence. Back in action, truly! #Gamechanger pic.twitter.com/HKpjXeNfbH
— Shankar Shanmugham (@shankarshanmugh) July 11, 2023