Game Changer Arugu Meedha Song | మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ ఛేంజర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ సినిమా వస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌తో పాటు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్.
”అలికి పూసిన అరుగు మీద కలికి సుందరినై కూసుంటే పలకరించవేంది ఓ దొర. చిలక ముక్కు చిన్ని నా దొరా”. అంటూ ఈ మెలోడి ఉండగా.. రామ్ చరణ్ అంజలిపై ఈ పాటను చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. థమన్, ఎస్ రోషిని జేకెవీ కలిసి పాడారు. థమన్ సంగీతం అందించాడు. ఇప్పటికే జరగండి.. జరగండి, ధోప్, రా మచ్చా సాంగ్‌లతో దూసుకుపోతున్న ఈ చిత్రంకి మెలోడి జత కావడంతో సూపర్ హిట్ కాయం అంటున్నారు అభిమానులు.