రాజకీయం, నమ్మకద్రోహం, అనుబంధం, సామాజికస్పృహ.. ఈ నాలుగింటితో మిళితమైన పొలిటికల్ థ్రిల్లర్ ‘గేమ్‌చేంజర్’. దర్శకుడు ఎస్.శంకర్ తెరకెక్కించిన జెంటిల్‌మేన్, భారతీయుడు, ఒకేఒక్కడు, అపరిచితుడు చిత్రాల్లో ఉండే సామాజిక చైతన్యం ఇందులో కూడా ఉంటుందని తెలుస్తున్నది. రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, కైరా అద్వానీ కథానాయికలు. శ్రీకాంత్ ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారు. సోమవారం నుండి ఈ సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్‌లో మొదలుకానున్నట్టు సమాచారం. రామ్‌చరణ్, ఎస్జే సూర్య, నవీన్చంద్రలతో పాటు మరికొందరు ఈ షెడ్యూల్లో భాగం కానున్నట్టు తెలుస్తున్నది. కథానుగుణంగా కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో తెరకెక్కించనున్నారు శంకర్. భారీ అంచనాలున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. సునీల్, సముద్రఖని ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, సంగీతం: తమన్.