Game Changer | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్ (Game changer). ఆర్సీ15గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ లోడింగ్ అవుతోంది. దసరా సందర్బంగా తొలి సాంగ్‌ను విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే అందించబోతున్నారు మేకర్స్. శంకర్ సినిమా అంటే సాంగ్స్ ఎంత కలర్ఫుల్గా, రిచ్‌గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరి మొదటి పాట ఎలా ఉండబోతుందోనని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌లో రాంచరణ్ డ్యుయల్ షేడ్స్‌లో కనిపించనుండగా.. రాజోలు భామ అంజలి మరో లీడ్ రోల్లో నటిస్తోంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో షురూ అవగా.. వికారాబాద్, శంషాబాద్‌లో కూడా ఓ మినీ షెడ్యూల్ కొనసాగనున్నట్టు అప్డేట్ వచ్చిందని తెలిసిందే.
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. రాంచరణ్ దీంతోపాటు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఆర్సీ 16కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే.
గేమ్ ఛేంజర్ ఫస్ట్ సాంగ్ లోడింగ్..
#RamCharan #Gamechanger first single on Dussehra
update soon !
— Rajesh Manne (@rajeshmanne1) October 17, 2023