Game changer Dhop Song | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ గేమ్ ఛేంజర్(Game changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ మూవీ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.
ఆచార్య సినిమా వచ్చిన ఈ సినిమా డిజాస్టార్ అవ్వడంతో వారి ఆశలన్నీ ప్రస్తుతం వస్తున్న గేమ్‌ఛేంజర్ పైనే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు మూడు పాటలను విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మూవీ నుంచి మరోసాంగ్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ మూవీ నుంచి ‘ధోప్’ అనే పార్టీ సాంగ్‌ను డిసెంబర్ 21న రిలీజ్ చేయునున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా సాంగ్ ప్రోమోను పంచుకున్నారు.
Can’t get enough of their energy!! Global Star @AlwaysRamCharan and @advani_kiara in their most electrifying avatars for #Dhop 💥
See you on 22nd december with the full song! 😎❤️
A @MusicThaman Musical 🎶
Lyrics “SaraswathiPuthra” @ramjowrites… pic.twitter.com/2putxfA1jh
— Sri Venkateswara Creations (@SVC_official) December 18, 2024