Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer) తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. కార్తీక్ సుబ్బరాజు కథను అందిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా విడుదల సందర్భంగా విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు అభిమానులు. ఈ కటౌట్‌ను నేడు సాయంత్రం లాంఛ్ చేశారు నిర్వహాకులు. అఖిల్ భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, రామ్‌చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేయగా ఇంత భారీ స్థాయిలో కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి అని అభిమానులు వెల్లడించారు.
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించాడు. రామ్ చరణ్, కియారా అద్వాణి, ఎస్.జె.సూర్య, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 2025 జనవరి 10న విడుదల కానుంది.
Mass ki mogudu
Ah seal puttinchindhe vaadu @AlwaysRamCharan 🔥#GameChangerBiggestCutout pic.twitter.com/3V7hiorFx4
— Whisky 🦅 (@AegonTargeryean) December 29, 2024