Gamblers | మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన హీరో సంగీత్ శోభన్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం గ్యాంబ్లర్స్. రేష్మాస్ స్టూడియోస్, స్నాప్ అండ్ క్లాప్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కెఎస్‌కె చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రశాంతి చారులింగా కథానాయికగా నటిస్తోంది. రాకింగ్ రాకేశ్, పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిస్టరీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. థ్రిల్లింగ్, ఆశ్చర్యపోయే అంశాలతో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందించారు.
జూన్ 6న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుండగా, చిత్రబృందం ప్రమోషన్ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. యుద్ధం ఎక్కడ మొదలుపెట్టాలో తెలియాలి.. జూదం ఎక్కడ ఆపాలో తెలియాలి అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. పేకాట జూదం నేపథ్యంలో ఈ మూవీ రూపొందినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాతో మ్యాడ్ హీరో మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక ఈ చిత్రంలో జబర్దస్త్ ఫేం రాకింగ్ రాకేష్ పృథ్వీరాజ్ బన్న, సాయి శ్వేత, , జస్విక, భరణి శంకర్, మల్హోత్త్ర శివ, శివారెడ్డి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఇదొక వైవిధ్యమైన కథతో మిస్టరీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్నట్లు ఇటీవల దర్శకుడు చైతన్య చెప్పుకొచ్చారు. సంగీత్ నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించే చిత్రం ఇదికాగా, ఇందులోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంతో పాటు ఆశ్చర్యపరుస్తాయని అంటున్నారు. మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్, బాహుబలి రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో శ్రీవల్లి అనే సైన్స్ ఫిక్షన్ రూపొందగా,ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్ బృందావనంలు ఈ సినిమాను నిర్మిస్తుండడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్ననేపథ్యంలోఈ చిత్రాన్ని జూన్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.