Gali Janardhan reddy son action stunt’s | కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ తనయుడు కిరీటి రెడ్డి సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలిసిందే. కన్నడలో వచ్చిన ‘మాయబజార్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు మూలాలున్న గాలి జనార్థన్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కిరీటీ నటన, డ్యాన్స్ వంటి వాటిలో శిక్షణ తీసుకున్నాడట. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా చిత్రబృందం కిరీటీకి సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఈ వీడియోలో యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో కిరీటి యాక్షన్ సన్నివేశాలను ప్రాక్టీస్ చేస్తున్నట్లు ఈ వీడియోలో ఉంది. కిరీటి యాక్షన్ సీన్లలో ఎంత కష్టపడ్డాడో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అంతేకాకుండా ఎలాంటి డూప్ లేకుండా కిరీటి రిస్కీ సన్నివేశాలను కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని చోట్ల కాళ్ళకు, చేతులకు దెబ్బలు కూడా తగిలాయి. అయినా సరే హీరో తన ప్రాక్టీస్‌ను కంటిన్యూ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో కిరీటికి జోడిగా ‘పెళ్ళి సందD’ ఫేం శ్రీలీలా హీరోయిన్గా నటించగా జెనీలియా కీలకపాత్రలో నటించనుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు.