ప్రముఖ వ్యాపారవేత్త, కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhan Reddy) కుమారుడు కిరీటి (Gali Kireeti) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కబోతున్న సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరోగా లాంఛింగ్ ఇచ్చే ముందు కిరీటి అన్ని రకాల శిక్షణలు తీసుకున్నాడు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి (Sai Korrapati) ఈ ప్రాజెక్టును నిర్మించబోతున్నాడు. హై బడ్జెట్ ఎంటర్ టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి పాపులర్ టెక్నీషియన్లు పనిచేయనున్నారు.
రాధాకృష్ణ డైరెక్ట్ చేయబోతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Sai Korrapati) మ్యూజిక్ డైరెక్టర్..కాగా బాహుబలి సినిమాకు పనిచేసిన కే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్ కాగా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ స్టంట్ డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ పార్టు దృష్ట్యా పీటర్ హెయిన్స్ ను స్టంట్ డైరెక్టర్ గా తీసుకుంటున్నారట.
మార్చి 4న కిరీటీ లాంఛింగ్ ప్రాజెక్టు పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలపై త్వరలో స్పష్టత రానుంది.